దానం నాగేందర్ రాజీనామా -హైకమాండ్ కీలక హామీ..!?

దానం నాగేందర్ రాజీనామా -హైకమాండ్ కీలక హామీ..!?

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు దానం

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు దానం నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది.

హైదరాబాద్ కేంద్రంగా మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసారు. దానం పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఈ మేరకు నోటీసులు జారీ చేసారు. కాగా.. దానం తనకు సమయం కావా లని దానం తాజాగా స్పీకర్ కు లేఖ రాసారు.

ఇప్పటి వరకు నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. కాగా.. ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో దానం భేటీ అయ్యారు. తాను రాజీనామాకు సిద్దమని స్పష్టం చేసారు. ఈ సమయంలోనే దానంకు ప్రభుత్వంలో ప్రాధాన్యత పైన పార్టీ నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో పోటీ చేయటం తనకు కొత్త కాదని.. గెలిచే సత్తా తనకు ఉందని దానం చెప్పినట్లు సమాచారం.

అయితే, దానం రాజీనామా పైన రేవంత్ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం ఉండాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పుడు దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పిన దానం.. తాను మాత్రం మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేసారు. అనర్హత పిటీషన్ పై స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

కాగా.. గ్రేటర్ పరిధిలో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం మూడు వందల వార్డుల్లో పని చేస్తానని దానం ప్రకటించారు. దీని ద్వారా దానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇక కాంగ్రెస్ కోసం నేరుగా పని చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, గ్రేటర్ ఎన్నికల తరువాతనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు దానం పైన స్పీకర్ నిర్ణయం ఏంటి.. ముఖ్యమంత్రి ఇక దానం కు రాజీనామా పైన ఎలాంటి సూచనలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos