మిత్తితో సహా తీర్చేస్తాం -హరీష్ హెచ్చరిక..!!

మిత్తితో సహా తీర్చేస్తాం -హరీష్ హెచ్చరిక..!!

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. దీని పైన మంత్రులు ఘాటుగా స్పందించారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. దీని పైన మంత్రులు ఘాటుగా స్పందించారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నేతలను ఎవరైనా ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి రాగానే మిత్తితో సహా తీర్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. సర్పంచ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ… బతుకమ్మ చీరలు ఇచ్చిన వారు ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయాలని కోరారని చెప్పుకొచ్చారు. గుండాయిజం చేసి పైసలు, సారా పంచి పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నిల్లో 4 వేలు మంది బీఆర్ఎస్ సర్పంచులు గెలుపొందారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని.. ఆ పార్టీ గుండెలో నుంచి 4 వేల మంది సర్పంచులు మొలకెత్తారన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

రెండు సంవత్సరాల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఎవరన్నా తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి మన గవర్నమెంట్ వచ్చాక మిత్తితో తీర్చేద్దామంటూ కొత్త సర్పంచులతో మాజీ మంత్రి అన్నారు. రైతుబంధు సగం సగం ఇచ్చారని.. బోనస్ బోనాల మిచ్చిండు యాసంగి ఎగ్గొట్టారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదని చెప్పారు. పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడితే ప్రజలకు ఏం వస్తుందని.. తెలంగాణ ప్రజలు త్వరలో రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుతారంటూ వ్యాఖ్యానించారు. యూరియా కావాలంటే యాప్‌లు పెట్టారని..యాప్ ఎందుకు పంట పండించడానికా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు త్వరలో గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు.

 

 

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!