కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్,డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరైన సిరాజ్‌కు డీజీపీ కార్యాలయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు.దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు సిరాజ్ శుభాకాంక్షలు తెలియజేసి, 'జెర్సీ
కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 :
భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్,డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరైన సిరాజ్‌కు డీజీపీ కార్యాలయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు.దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు సిరాజ్ శుభాకాంక్షలు తెలియజేసి, ‘జెర్సీ నంబర్ 73’ని ఆవిష్కరించారు.ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సిరాజ్, క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే సీవీ ఆనంద్ డీజీపీ కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ యాక్ట్ సవరణ ద్వారా గ్రూప్-1 కేడర్ డీఎస్పీ ఉద్యోగాన్ని,జూబ్లీహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించింది.ఈ ప్రత్యేక సమావేశంలో ఐజీ గజారావు భూపాల్, డీఎస్పీ రామారావు తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *