నిజామాబాద్ క్రైమ్ (కబురు న్యూస్) జూన్15: నగరంలోని హమల్వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నిం చిన ముగ్గురు దొంగలను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దొంగలు ఆలయం గేటు తాళాన్ని అక్సర్ బ్లేడ్ తో కట్ చేసి లోనికి ప్రవేశించారు. స్థానికులు గమనించి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి విచారిస్తున్నారు. అయితే
నిజామాబాద్ క్రైమ్ (కబురు న్యూస్) జూన్15:

నగరంలోని హమల్వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నిం చిన ముగ్గురు దొంగలను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దొంగలు ఆలయం గేటు తాళాన్ని అక్సర్ బ్లేడ్ తో కట్ చేసి లోనికి ప్రవేశించారు. స్థానికులు గమనించి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి విచారిస్తున్నారు. అయితే ముగ్గురు దొంగలు పంజాబ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *