👉బిఆర్ఎస్ హయాంలో కల్లాల్లో రైతుల ప్రాణాలు విడిచిన ఘటనలు మరిచారా? 👉ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరం 👉మాది చేతల ప్రభుత్వం.. 👉బూత్ స్థాయి నుంచి పార్టీ బలో పేతానికి కృషి చేయాలి 👉కష్టపడి పని చేయండి పార్టీ తప్పక గుర్తిస్తోంది.. 👉కామారెడ్డి జిల్లా కాంగ్రె స్ కమిటీ విస్తృత సమా వేశంలోటిపిసిసి అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ
👉బిఆర్ఎస్ హయాంలో కల్లాల్లో రైతుల ప్రాణాలు విడిచిన ఘటనలు మరిచారా?
👉ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరం
👉మాది చేతల ప్రభుత్వం..
👉బూత్ స్థాయి నుంచి పార్టీ బలో పేతానికి కృషి చేయాలి
👉కష్టపడి పని చేయండి పార్టీ తప్పక గుర్తిస్తోంది..
👉కామారెడ్డి జిల్లా కాంగ్రె స్ కమిటీ విస్తృత సమా వేశంలోటిపిసిసి అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26:
అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుం దని టిపిసిసి అధ్య క్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నా రు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలో పేతం కోసం కృషి చేయా లని పిలుపునిచ్చారు. కామా రెడ్డిలో మంగళవారం నిర్వ హించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యేలు, టీపీసీ సీ కోఆర్డినేటర్లు, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా స్వాగతం పలికి శాలు వా తో సన్మానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారుకాం గ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించా ల్సిన బాధ్యత మీపై ఉంద న్నారు.ఉచిత బస్సు మొద లుకొని సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా సం క్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఎక్కడ లేని విధంగా పార దర్శకంగా కుల గణన సర్వే నిర్వహిం చామన్నారు.
మాది చేతల ప్రభుత్వం..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మాటలకే పరి మితం కాకుండా.. మాది చేతల ప్రభుత్వమని టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.వరి వేస్తే ఉరి అని బిఆర్ఎస్ నేతలు అన్నారు. ఇప్పుడు రైతులపై బిఆర్ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. 75 లక్ష ల మెట్రి క్ టన్ను ల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. బిఆర్ ఎస్ హయంలో కల్లాల్లో రైతు లు ప్రాణాలు విడిచిన సంఘ టనలు మరిచిపోలేద న్నా రు.ఎవరెన్ని చెప్పినా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో, మునిసిపల్ ఎ న్నిక ల్లో 75 శాతంకి పైగా సీట్లు గెలిచామన్నారు. వచ్చే ఎన్ని కల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తా మని జోస్యం చెప్పారు. ఇల్లు లేని పేద లకు ఇళ్లు అంద జేయా లన్నది ఖర్గే,సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల అని అన్నారు.విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోం దన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి పలాయనం చిత్తగించిన మొక్కవోని ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల నేతృ త్వంలో పాలన కొనసాగుతోం దన్నా రు.కష్టపడి పని చేయండి పార్టీ తప్పక గుర్తిస్తుందనీ పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుల నిజామాబాద్ పర్యటన రద్దు
మాజీ మంత్రి శనిగరి సంతోష్ రెడ్డి సతీమణి మరణ వార్త తెలిసి కామారెడ్డి నుంచి హైదరా బాద్ బయల్దేరిన టీపీసీసీ
టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పర్యటన రద్ద యింది. మాజీ మంత్రి శనిగరి సంతోష్ రెడ్డి సతీమణి విజయా రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్య క్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. విజయా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగ వంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలియ జేశారు. ఈ దుఃఖ సమ యంలో కుటుంబ సభ్యు లకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.మాజీ మంత్రి శనిగరి సంతోష్ రెడ్డి సతీ మణి మరణ వార్త తెలిసి కామారెడ్డి నుంచి టిపిసిసి అధ్యక్షులు హైదరా బాద్ కు బయలుదేరారు. నిజా మాబాద్ జిల్లాలో నిర్వ హించాల్సిన వివిధ పార్టీ కార్యక్రమాలను రద్దు చేశారు.




















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *